
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, ఎంఐఎం రెండూ ఒక్కటేనని, బీజేపీని ఓడించేందుకు ఆ రెండు పార్టీలు చూస్తున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ గెలవాల ని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నదని, ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ బయట పెట్టారని ఆయన చెప్పారు. బుధవారం బీజేపీ స్టేట్ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రత్యక్షంగా ఎంఐఎంను పెంచి పోషించాయని ఫైర్ అయ్యారు. కరువు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే కరువు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అన్నారు. కాంగ్రెస్ మార్పు అంటే కరెంట్ కోతలు, కరువు, రైతుల ఆత్మహత్యలు అని ఆయన విమర్శించారు.