
- 119 నియోజకవర్గాల్లో ప్రారంభం
- 15 రోజుల పాటు 11 వేల శక్తి కేంద్రాల్లో ప్రోగ్రామ్స్
హైదరాబాద్, వెలుగు: బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. కేసీఆర్ సర్కార్ తొమ్మిదేండ్లలో నేరవేర్చని హామీలు, కుటుంబ అవినీతి, నియంత పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించాలనే లక్ష్యంతో “ప్రజా గోస.. బీజేపీ భరోసా” పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో.. 11 వేల శక్తి కేంద్రాల్లో ఈ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. ఈ నెల 10 నుంచి 25 వరకు 15 రోజుల పాటు కొనసాగనుంది. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ఓ వైపు ఎండగడుతూనే ఇంకో వైపు మోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై జనానికి అవగాహన కల్పించడం, ఇంటింటికీ కమలం గుర్తును తీసుకెళ్లడం ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఎజెండా అని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల ప్రారంభానికి నియోజకవర్గాల వారీగా హాజరయ్యే జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల జాబితాను గురువారం రాష్ట్ర పార్టీ ప్రకటించింది.
నియోజకవర్గం హాజరయ్యే నేత
కూకట్పల్లి బండి సంజయ్
సికింద్రాబాద్ కిషన్ రెడ్డి
మహబూబ్ నగర్ డీకే అరుణ
సనత్ నగర్ సునీల్ బన్సల్, లక్ష్మణ్
శేర్ లింగంపల్లి మురళీధర్ రావు
మంచిర్యాల వివేక్ వెంకటస్వామి
జగిత్యాల ధర్మపురి అర్వింద్
దుబ్బాక విజయశాంతి
ఉప్పల్ రఘునందన్ రావు
మహేశ్వరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి
పరిగి జితేందర్ రెడ్డి
భువనగిరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కొత్తగూడెం పొంగులేటి సుధాకర్ రెడ్డి