గాడ్సే దేశ భక్తుడన్న ప్రజ్ఞా సింగ్‌పై బీజేపీ వేటు

గాడ్సే దేశ భక్తుడన్న ప్రజ్ఞా సింగ్‌పై బీజేపీ వేటు

మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ నిన్న లోక్‌సభలో చేసిన కామెంట్స్‌ను ఆ పార్టీ ఖండించింది. ప్రజ్ఞా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని, ఆమె వ్యాఖ్యలను బీజేపీ సపోర్ట్ చేయదని బీజేపీ వర్కింగ్ ప్రెసిండెంట్ జేపీ నడ్డా తెలిపారు. ఈ రకమైన ఐడియాలజీకి తాము వ్యతిరేకమని చెప్పారు.

MORE NEWS: 

గాంధీని చంపిన గాడ్సేపై సాధ్వి ప్రజ్ఞ సంచలన వ్యాఖ్యలు

ప్రజ్ఞాసింగ్‌ కామెంట్స్‌ను తప్పుబడుతూ ఆమెపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు జేపీ నడ్డా తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసే వరకు పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు ఆమెను అనుమతించబోమని చెప్పారాయన. అలాగే డిఫెన్స్ పార్లమెంటరీ కమిటీ సభ్యురాలిగా ఆమె నియామకాన్ని కూడా రద్దు చేస్తున్నామని వెల్లడించారు.