ప్రధాని మార్గదర్శకత్వంలో బీజేపీ విజయం: యోగి ఆదిత్యానాథ్‌

ప్రధాని మార్గదర్శకత్వంలో బీజేపీ విజయం: యోగి ఆదిత్యానాథ్‌

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో బీజేపీకి… బీహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ…బీహార్ లో ఘన విజయం సాధించిందన్నారు. ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమిపై విస్పష్ట ఆధిక్యం కనబరిచిందని చెప్పారు

243 స్ధానాలు ఉన్న  బీహార్ అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 123 స్ధానాల్లో ఆధిక్యంతో మేజిక్‌ మార్క్‌కు చేరువ కాగా, మహాకూటమి 112 స్ధానాల్లో ముందంజలో ఉండగా ఇతరులు 8 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. మరోవైపు యూపీలో జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఆరు స్ధానాల్లో బీజేపీ విక్టరీని సాధించడం పై పార్టీ కార్యకర్తలను యోగి ఆదిత్యానాథ్‌ అభినందించారు. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది.