తల్లిదండ్రుల కలలు నిజం చేయాలి: వివేక్

తల్లిదండ్రుల కలలు  నిజం చేయాలి: వివేక్
  • స్టూడెంట్లు చిన్నతనం నుంచే లక్ష్యం పెట్టుకొని చదవాలి

యాచారం, వెలుగు: స్టూడెంట్లు బాగా చదువుకుని తల్లిదండ్రుల కలలు నిజం చేయాలని బీజేపీ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి సూచించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో జడ్పీ హైస్కూల్​కు ఫర్నిచర్, స్ట్రీట్ వెండర్లకు తోపుడు బండ్లను కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ ప్రభుత్వ బడిలో చదివిన స్టూడెంట్లు గొప్ప స్థాయికి ఎదుగుతారని తెలిపారు. 

స్టూడెంట్లు స్కూల్ దశలోనే సంస్కారం, క్రమశిక్షణ నేర్చుకుంటారన్నారు. డాక్టర్, ఇంజినీర్, ఐఏఎస్ అధికారి అవుతానని చిన్నవయస్సులోనే గోల్ పెట్టుకొని చదివి తల్లిదండ్రుల కలలు నిజం చేయాలన్నారు. కాకా వెంకటస్వామి కేవలం 10వ తరగతి చదువుకున్నారని తెలిపారు. పేద విద్యార్థులను చదివించడానికి ఆయన అంబేద్కర్ ఇన్​స్టిట్యూట్ ప్రారంభించారని పేర్కొన్నారు. కాకా కోరిక మేరకే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యి స్కూళ్లలో ఫర్నిచర్ పంపిణీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాష, సుకన్య, శ్రీధర్ రెడ్డి, గోగిరెడ్డి లచ్చిరెడ్డి, అంజయ్య యాదవ్, పోరెడ్డి నర్సింహ్మా రెడ్డి, రవీందర్, విజయ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.