యూపీలో బీజేపీ ఓటమి తప్పదు

యూపీలో బీజేపీ ఓటమి తప్పదు

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పొలిటికల్‌ హీట్‌ను రాజేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు గెలుపు తమదంటే, తమదంటూ ప్రకటనలు చేస్తూ ప్రచార జోరులో ఉన్నాయి. గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దాదాపుగా ఐదు రాష్ట్రాల్లోనూ పొత్తులు, సీట్ల కేటాయింపులపై కసరత్తులు ఓ కొలిక్కి వచ్చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా  పటోల్ జోష్యం చెబుతున్నారు. మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోబోయేది తమ పార్టీనే అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని నానా పటోల్ అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రమైన యూపీలోనూ ఆ పార్టీ గెలవబోదని ఆయన అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

సౌత్ సినిమా ఇండస్ట్రీ.. బాలీవుడ్‌తో జాగ్రత్త

పంజాబ్‌లో పూర్తైన బీజేపీ మిత్రపక్షాల సీట్ల పంపకం

'విమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా స్మృతి