వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం: వివేక్​ వెంకట స్వామి 

వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం: వివేక్​ వెంకట స్వామి 
  • మాజీ ఎంపీ వివేక్​ వెంకట స్వామి 
  • బెల్లంపల్లిలో భారీ బైక్ ర్యాలీ 

బెల్లంపల్లి, వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్​ వెంకట స్వామి అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్​ ఆవరణలో బీజేపీ జెండాను ఎగురవేశారు. కాల్ టెక్స్ ఫ్లై ఓవర్, ఏఎంసీ, పాత జీఎం కార్యాలయ చౌరస్తా, పాత బస్టాండ్, టేకులబస్తీ, కన్నాల ఫ్లై ఓవర్ మీదుగా గంగారాం నగర్ వరకు ర్యాలీ కొనసాగింది.

అనంతరం వివేక్ మాట్లాడుతూ.. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్​ను ఇంటికి సాగనంపుతారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ పి.మల్లికార్జున్, జిల్లా జనరల్ సెక్రటరీ మునిమంద రమేశ్, అందుగుల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీ కృష్ణ దేవరాయులు, బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ కోడి రమేశ్, సీనియర్ నాయకులు కొయ్యల ఏమాజి, జిల్లా సెక్రటరీలు పానుగంటి మధుసుదన్ రావు, కోయిల్కార్ గోవర్థన్, లీడర్లు నాగరాజు, కె, విజయ్, సబ్బని రాజనర్సు, శైలేందర్ సింగ్, రాజులాల్ యాదవ్, పుల్గం తిరుపతి, బి, కేశవరెడ్డి, ఎరుకల నర్సింగ్, దార కల్యాణి, రేవెల్లి రాజలింగు, బైస మల్లేష్, అజయ్, మహిధర్ తదితరులు పాల్గొన్నారు. 

తాండూర్ లో బీజేపీ ఆఫీసు ప్రారంభం

బీజేపీ తాండూర్ మండల ఆఫీస్ ను గురువారం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. కలిసి కట్టుగా పని చేసి  బీజేపీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు  సూచించారు. తాండూర్ మండల కేంద్రంలో, గంపలపల్లి గ్రామంలో బీజేపీ జెండా గద్దెలను ఆయన ఆవిష్కరించారు. ఆ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు రూ.50 వేల విరాళాన్ని ప్రకటించారు. బీజేపీ మండల అధ్యక్షుడు రామగోని మహిధర్ గౌడ్ తండ్రి సత్యాగౌడ్ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లారెడ్డి, బీజేపీ లీడర్లు పాల్గొన్నారు. టేకులపల్లిలో బీజేపీ కార్యకర్తలు నాయకులతో సహపంక్తి భోజనాల్లో వివేక్​ పాల్గొన్నారు.  

శివగణేశ్ ఆలయంలో వివేక్​ పూజలు 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మండలం చిన్నగోపాల్​పూర్​ గ్రామంలోని శివగణేశ్ ఆలయాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్​ జి.వివేక్​ వెంకటస్వామి గురువారం సందర్శించారు. ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త లక్సెట్టిపేట జడ్పీటీసీ సభ్యుడు ముత్తె సత్తయ్యను వివేక్​ అభినందించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు, మండల​ అధ్యక్షుడు బొలిశెట్టి తిరుపతి పాల్గొన్నారు.