
ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. ఆప్ కార్యాలయం ముందు కార్యకర్తలు నిరసనకు చేపట్టారు. భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు తరలిరావడంతో అలర్ట్ అయిన పోలీసులు నిరసనకారులను అడ్డుకునేందుకు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అయినా లెక్క చేయని ఆందోళనకారులు వాటిపైకి ఎక్కి నిరసన తెలిపారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. వారిని అదుపులోకి పోలీసులు స్టేషన్ కు తరలించారు.