క్యాన్సర్ తో ‘బ్లాక్ పాంథర్’ హీరో మృతి

క్యాన్సర్ తో ‘బ్లాక్ పాంథర్’ హీరో మృతి

బ్లాక్ పాంథర్, కెప్టెన్ అమెరికా న‌టుడు, చాడ్విక్ బోస్మాన్ 43 ఏళ్ల వ‌య‌స్సులో పెద్ద ప్రేగు క్యాన్స‌ర్‌తో పోరాడుతూ కన్నుమూశాడు. గత కొన్నేళ్ల నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్న చాడ్విక్ శుక్రవారం ఇంట్లోనే చనిపోయినట్లు ఆయ‌న కుటుంబసభ్యులు తెలిపారు. క్యాన్సర్ మూడో దశకు చేరిన తర్వాత చాడ్విక్ గుర్తించాడు. అప్పటినుంచి పలు శస్త్రచికిత్సలు, కీమోథెరపీలు చేయించుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. బోస్మాన్ మరణ వార్త హాలీవుడ్ పరిశ్రమను మరియు అభిమానుల్ని షాక్ కు గురిచేసింది.

బోస్మాన్ 2018లో విడుదలయిన బ్లాక్ పాంథర్ సినిమాతో చాడ్విక్ మొదటి బ్లాక్ సూపర్ హీరో అయ్యాడు. ఈ చిత్రం విమర్శకులు మరియు ప్రేక్షకులచే ప్రశంసించబడింది. అంతేకాకుండా ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన మొట్టమొదటి కామిక్ పుస్తక చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ కు పైగా కలెక్షన్లు రాబట్టింది.

చాడ్విక్ తన కెరీర్ ప్రారంభంలో.. ప్రముఖ బేస్ బాల్ ఆటగాడు జాకీ రాబిన్ సన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెకకిన ‘42’ సినిమాలో నటించారు. చాడ్విక్ 2016లో విడుదలయిన కెప్టెన్ అమెరికా సివిల్ వార్ తో హాలీవుడ్ ప్రముఖ నటుల సరసన చేరాడు. ఆ తర్వాత 2018లో విడుదలయిన అవేంజర్స్ ఇన్ఫినిటీ వార్, అవేంజర్స్ ఎండ్ గేమ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. చాడ్విక్ తన చివరి చిత్రం ద 5 బ్లడ్స్ లో స్పై గా నటించాడు. ఆ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. 2022లో విడుదలకు ప్లాన్ చేసిన బ్లాక్ పాంథర్ సీక్వెల్ కోసం చాడ్విక్ ప్రస్తుతం సిద్దమవుతున్నాడు.

సౌత్ కెరొలినాలో జన్మించిన చాడ్విక్ తల్లిదండ్రులు ఆఫ్రికాలోని రాష్ట్రం సియెర్రా లియోన్ కు చెందినవారు. చాడ్విక్ తల్లి ఒక నర్సు మరియు తండ్రి ఒక ఎంటర్ ప్రెన్యూయర్ గా పనిచేసేవారు. చాడ్విక్ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. చాడ్విక్ అన్ని తరాల వారికి స్ఫూర్తినిచ్చాడని డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ట్వీట్ చేశారు.

For More News..

పుల్వామాలో ఎన్‌కౌంట‌ర్.. ఒక జవాను.. ముగ్గురు టెర్రరిస్టులు మృతి

5.5 కోట్లు పెట్టి కట్టిన్రు.. మెయింటెనెన్స్ మరిచిండ్రు..

నిజామాబాద్ బాలుడి హత్య కేసులో నిందితుడు నాగరాజే

బంగారం కంటే ప్లాటినమే అగ్గువ.. ఆసక్తి చూపుతున్న యువత