అన్నింటికీ రాష్ట్రాలపైనే నిందలా?

అన్నింటికీ రాష్ట్రాలపైనే నిందలా?

అన్నింటికీ రాష్ట్రాలపైనే నిందలా?
ప్రధాని మోడీపై రాహుల్‌ ఫైర్‌

న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలకు సూచించడాన్ని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు. ఇంధనంపై విధించే పన్నుల్లో 68% వరకు కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటోం దని, అయినా రాష్ట్ర ప్రభుత్వాలను మోడీ నిందిస్తున్నారని గురువారం ట్విట్టర్‌‌లో మండిపడ్డారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికంగా ఉన్నా, దేశంలో బొగ్గు కొరత, ఆక్సిజన్‌ కొరత వేధిస్తున్నా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను మర్చిపోయి రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టేస్తోందన్నారు. దీని ద్వారా మోడీ చెప్తున్న ఫెడరలిజం సహకారం కాదని, అది నిర్బంధమని పేర్కొన్నారు. ‘‘అధిక ఇంధన ధరలు- రాష్ట్రాలను నిందించు, బొగ్గు కొరత‌‌-రాష్ట్రాలను నిందించు, ఆక్సిజన్‌ కొరత- రాష్ట్రాలను నిందించు.. ఇలా అన్ని విషయాల్లో రాష్ట్రాలను నిందిస్తూ ప్రధాని తన బాధ్యతను వదులుకుంటున్నారని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.