
నేరడిగొండ, వెలుగు: ఆటల్లో గెలుపోటములు సహజమని, వాటిని పట్టించుకోకుండా క్రీడాస్ఫూర్తితో యువత ముందుకు సాగాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని వడూర్ లో కొన్ని రోజులపాటు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో రాయల్ స్ట్రైకర్స్ జట్టుపై బ్లాస్టర్ఎలెవన్ టీమ్ విజయం సాధించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. చిన్నప్పటి నుంచే ఆటలపై ఆసక్తిని పెంచుకోవాలని, యువత కలిసికట్టుగా ఉండాలని సూచించారు. విన్నింగ్ జట్టుకు రూ.25 వేలు, రన్నరప్‌కు రూ.10 వేలు బహుమతిగా అందజేశారు. అనంతరం భవాని తాండాలో రబాడే అమర్ సింగ్ నాయక్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆదుముల్ల భూషణ్, అల్లూరి నవీన్, ఆడెపు శ్రీకాంత్, మండల నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.