
ఇజ్రాయెల్ కాల్పుల ఉల్లంఘన..ఇరాన్లో మరోసారి బాంబుల మోత మోగింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ప్రభుత్వ ఆస్తులు,మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున్న క్షిపణి దాడులు జరిగాయి. కాల్పుల విరమణ అమలులో ఉంది టెల్ అవీవ్ టెహ్రాన్‌పై దాడి చేయదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన కొన్ని గంటల్లోనే ఇరాన్ రాజధానిలో పేలుళ్లు వినిపించాయి. ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినందుకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ రాడార్ సైట్‌ను తాకినట్లు చెబుతోంది.
ఇరాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ట్రంప్ పేర్కొన్న తర్వాత కూడా దాడిని రద్దు చేయలేమని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇరాన్ కొత్త క్షిపణి దాడులు చేయడం వల్లే యుద్దసైరన్లు మోగించామని ఇజ్రాయెల్ అంటోంది. ఇదంతా ట్రంప్ ఇజ్రాయెల్ ను కాల్పులు జరపొద్దని ఆదేశించిన కొన్ని గంటల్లో జరిగింది.
డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిన కాల్పుల విరమణను రెండు వైపులా ప్రకటించి అంగీకరించిన కొన్ని గంటల తర్వాత టెహ్రాన్ టెల్ అవీవ్‌పై కొత్త క్షిపణి దాడి జరిగిందని ఇరాన్ కాల్పు విరమణ ఉల్లంఘన చేసిందని ప్రతిస్పందనగా ధీటుగా స్పందించాలని సాయుధ దళాలను ఆదేశించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు.అయితే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత యూదు దేశంపై ఎటువంటి క్షిపణులను ప్రయోగించలేదని ఇరాన్ రాష్ట్ర మీడియా ప్రకటించడాన్ని ఇరాన్ తిరస్కరించింది.