
కేరళలోని పెంపుడు జంతువులు అమ్మే ఓ దుకాణంలో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో దాదాపు 100 పక్షులు, కుందేళ్లు, చేపలు సజీవదహనమయ్యాయి. తిరువనంతపురంలోని షిబిన్ పెట్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల రూ.2.5లక్షలకు పైగా నష్టపోయానని షాప్ ఓనర్ షిబిన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
పెంపుడు జంతువులతోపాటు కొన్ని పరికరాలు కూడా కాలిపోయాయి. కుట్ర పూరితంగా ఎవరో కావాలనే షాప్ లో మంటపెట్టి ఉంటారని అనుమానంతో మరనల్లూరు పోలీసులకు ఫర్యాదు చేశాడు. పోలీసులు కేసు ఫైల్ చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.