గంటకు 1000 కి.మీ దూసుకెళ్లే కారిది

గంటకు 1000 కి.మీ దూసుకెళ్లే కారిది

కార్ లో వంద స్పీడ్ లో దూసుకుపోతేనే ఒళ్లు జల్లు మంటుంది. అలాంటిది దానికి పది రెట్లు ఎక్కువ స్పీడ్ తో, అంటే గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతే ఎట్లుంటది? ఆ రికార్డును బ్రిటన్ కు చెందిన బ్లడ్ హౌండ్ కొట్టేసింది. శనివారం జరిగిన ట్రయల్ టెస్టులో అది 628 మైల్స్ పర్ అవర్ (ఎంపీహెచ్ ) లేదా గంటకు 1,010 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. దక్షిణాఫ్రికాలోని నార్తర్న్​ కేప్ లోని హేక్స్ కీన్ పాన్ లో 27 కిలోమీటర్ల మట్టి ట్రాక్ పై బ్లడ్ హౌండ్ ను టెస్ట్​ చేస్తున్నారు . ఇంతకుముందు మరో ఆరు కార్లు 600 ఎంపీహెచ్ (గంటకు 965 కిలోమీటర్లు)
స్పీడ్ ను దాటి దూసుకెళ్లాయి . బ్లడ్ హౌండ్ కు జెట్ ఇంజన్ ను పెట్టారు . ప్రస్తుతం భూమిపై అత్యధికంగా ఓ కారు వెళ్లిన రికార్డ్​ స్పీడ్ 763 ఎంపీహెచ్ (గంటలకు 1,228 కిలోమీటర్లు). 22 ఏళ్ల క్రితంథ్రస్ట్​ ఎస్ఎస్ సీ అనే బ్రిటన్ కు చెందిన కారే ఆ రికార్డ్​ను సెట్ చేసింది. దానిని దాటేసేందుకుబ్లడ్ హౌండ్ దూసుకుపోతోంది.

ఇంకో విషయమేంటంటే అప్పుడు థ్రస్ట్​ ఎస్ ఎస్ సీ ని నడిపింది,ఇప్పుడు బ్లడ్ హౌండ్ టెస్ట్​ ట్రయల్ చేసింది ఒకేడ్రైవర్ కావడం విశేషం. ఆర్ ఏఎఫ్ పైలట్ ఆండీగ్రీన్ ఆ ఘనత దక్కిం చుకున్నాడు. ఇప్పటిదాకాసోనిక్ 1, బ్లూ ఫ్లేమ్ , థ్రస్ట్​ 2, బడ్ వైజర్ రాకెట్, సోనిక్ యారో, థ్రస్ట్​ ఎస్ఎస్ సీలు మాత్రమే 600 ఎంపీహెచ్ స్పీడు దాటాయి. అందులో బడ్ వైజర్ రాకెట్ , థ్రస్ట్​ ఎస్ ఎస్ సీలు మాత్రమే 700ఎంపీహెచ్ (1,126 కిలోమీటర్లు) స్పీడ్ రికార్డును అందుకున్నాయి . నిజానికి బ్లడ్ హౌండ్ ను వెయ్యి కిలోమీటర్ల వేగంతో నడిపించాలని ఆ కార్ టీంఅనుకుంది. అయితే, అనుకున్న దానికి మించి బ్లడ్ హౌండ్ దూసుకుపోయింది. దాని స్పీడ్ ను ఇంకా పెంచేం దుకు నార్వేకు చెందిన ఏరో స్పేస్ కంపెనీ నమ్మో, అందులో తన రాకెట్ ఇంజన్ ను పెట్టాలనుకుంటోంది. థ్రస్ట్​ ఎస్ఎస్ సీ తో పోటీ పడాలంటే ఆ బూస్టర్ తప్పనిసరి అంటోంది.