ధోనీకి ట్విట్టర్ షాక్.. బ్లూ టిక్‌ తొలగింపు

V6 Velugu Posted on Aug 06, 2021

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్వి్ట్టర్ షాక్ ఇచ్చింది. ధోని అకౌంట్ నుంచి ట్వి్ట్టర్ బ్లూ టిక్‌ను తొలగించింది. ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయని ట్విట్టర్.. టిక్ మార్క్‌ను మళ్లీ పునరుద్ధరిస్తుందా అనే విషయం పైనా క్లారిటీ ఇవ్వలేదు. గతంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆర్‌ఎస్‌ఎస్ మోహన్‌ భగవత్‌తో పాటుగా పలువురు ప్రముఖుల ట్విట్టర్‌ అకౌంట్‌ల బ్లూ టిక్ మార్క్‌ను తొలగించడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ట్విటర్ వీరి ఖాతాలకు బ్లూ టిక్‌ను పునరుద్దరించింది. కాగా, వెరిఫైడ్ ఖాతాలకు ట్విటర్ ఈ బ్లూ టిక్ ఇస్తుందన్న విషయం తెలిసిందే.

 

Tagged Twitter, MS Dhoni, Twitter Account, Blue Tick, Dhoni Twitter Account, Team India Cricketer

Latest Videos

Subscribe Now

More News