ఆదిత్య థాకరే సన్నిహితుడిపై ఈడీ దాడులు.. ముంబైలోని 15 ప్రదేశాలలో సోదాలు

ఆదిత్య థాకరే సన్నిహితుడిపై ఈడీ దాడులు.. ముంబైలోని 15 ప్రదేశాలలో సోదాలు

మనీలాండరింగ్ కేసుకు సంబంధించి శివసేన (యూబీటీ) నాయకులు ఆదిత్య థాకరే, సంజయ్ రౌత్‌ల సన్నిహితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త సుజిత్ పాట్కర్, సూరజ్ చవాన్, ఇతరులకు చెందిన ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. BMC కొవిడ్ స్కామ్‌కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబైలోని సంజీవ్ జైస్వాల్, సప్లయర్స్, IAS అధికారులతో సహా కొంతమంది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులకు చెందిన 15 కంటే ఎక్కువ ప్రదేశాలలో ఫెడరల్ ఏజెన్సీ దాడులు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు.

ALSO READ: ప్రైవేట్​ మెడికల్​ కాలేజీల్లో ఈడీ సోదాలు.. 

మహమ్మారి సమయంలో COVID-19 ఫీల్డ్ ఆసుపత్రులను నిర్వహించడం కోసం పాట్కర్, అతని ముగ్గురు పార్ట్ నర్స్ మోసపూరితంగా ముంబై పౌర సంస్థ కాంట్రాక్టులను పొందారని అధికారులు పేర్కొన్నారు. లైఫ్‌లైన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంస్థ పాట్కర్, ఇందులో ఇన్వాల్వ్ అయిన ఆ ముగ్గురిపై ​​ఇక్కడి ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ గతేడాది ఆగస్టులో ఫోర్జరీ కేసు నమోదు చేసింది.

ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు ఈడీ కేసు నమోదు చేసిందని అధికారులు తెలిపారు. మహమ్మారి సమయంలో ఆరోగ్య సదుపాయాల కోసం కాంట్రాక్టుల కేటాయింపులో అవకతవకలకు సంబంధించి BMC కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ ఈ ఏడాది జనవరిలో ED ముందు హాజరయ్యారు.

ఆజాద్ మైదాన్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, జూన్ 2020లో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సంస్థ పార్ట్ నర్స్ ఆరోపించిన ఫేక్ పార్ట్ నర్ షిప్ దస్తావేజును BMCకి సమర్పించారు. NSEL, వర్లీ, ములుండ్, దహిసర్ (ముంబైలో), జంబో.. వైద్యరంగంలో ఎలాంటి అనుభవం లేని COVID-19 కేంద్రాల ఒప్పందాలను పొందారు. ఈ COVID-19 కేంద్రాలలో సిబ్బంది, వైద్యులకు వైద్య ధృవీకరణ పత్రాలు లేవని, సరైన చికిత్స అందించడంలో విఫలమయ్యారని ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.

https://twitter.com/ANI/status/1671433903285080064