బ్యాంక్ హెల్ప్లైన్ పేరుతో మోసం .. BMC రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.10 లక్షల దోపిడి

బ్యాంక్ హెల్ప్లైన్ పేరుతో మోసం .. BMC రిటైర్డ్  ఉద్యోగి నుంచి రూ.10 లక్షల దోపిడి

సైబర్ నేరాలు రోజురోజు కు పెరిగి పోతున్నాయి. రోజుకో తీరుగా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు..డబ్బుల ఆశ జూపి కొందరు మోసాలకు పాల్పడితే.. మరొకొందరు  సాయం చేస్తున్న నటిస్తూ మోసం చేస్తున్నారు. అమాయకులే కాదు.. బాగా అవగాహన ఉన్న వాళ్లు కూడా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. డిజిటల్ ట్రాన్ జక్షన్  పెరుగుతున్న వేళ.. సైబర్ నేరాలు మరింత పెరుగుతున్నాయి. ఆన్ లైన్ సేవలు వినియోగించుకునే వారికి సైబర్ నేరగాళ్ల బెడద ఎక్కువైంది. తాజా ఓ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి  సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంకు ఖాతా ఖాళీ చేసుకున్న సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. 

బృహన్  ముంబై మున్సిపల్ కార్పొరేషన్  లో పనిచేసి ఇటీవల రిటైర్డ్ ఓ 65 యేళ్ల వృద్ఢుడు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. బ్యాంక్ అప్లికేషన్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ సెటప్ చేసుకునే క్రమంలో నకిలీ బ్యాంక్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేశాడు. ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేసుకున్న సైబర్ మోసగాడు బాధితుడికి ఓ లింక్ పంపాడు. ఆ లింక్ క్లిక్ చేయడంతో దఫాలుగా వృద్ధుడి ఖాతానుంచి రూ. 10 లక్షలు ధఫాలుగా కాజేశాడు. ఆన్ లైన్ లో లావాదేవీలు చేసేటప్పడు జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.