
ఎలక్ట్రిక్ మోడల్ ఐఎక్స్1 ను ఇండియాలో బీఎండబ్ల్యూ లాంచ్ చేసింది. ఈ బండి ధర రూ. 66,90,000 (ఎక్స్ షోరూమ్). ఎక్స్1 మోడల్లో పెట్రోల్, డీజిల్ వెర్షన్లను కూడా కంపెనీ అమ్ముతోంది. ఐఎక్స్1 ఫుల్ ఛార్జ్‌పై 440 కి.మీ వరకు వెళుతుందని కంపెనీ పేర్కొంది. ఈ కారు 100 కి.మీ స్పీడ్‌ను 5.6 సెకన్లలో అందుకుంటుందని వెల్లడించింది.