తెలుగు చాప్టర్ బీఎన్ఐ అక్షర ప్రారంభం

తెలుగు చాప్టర్ బీఎన్ఐ అక్షర ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: తెలుగులోనే వ్యాపార లావాదేవీలు జరుపుకునేందుకు వీలుగా బీఎన్‌‌‌‌ఐ హైదరాబాద్ ఆధ్వర్యంలో తెలుగు చాప్టర్ 'బీఎన్ఐ అక్షర' ను ప్రారంభించినట్టు సంస్థ తెలిపింది. ఇందులో వివిధ వ్యాపార వర్గాలకు చెందిన నలభై ఆరు మంది వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. ప్రపంచంలోని మొట్టమొదటి తెలుగు చాప్టర్ ఇది.

బీఎన్ఐ అక్షర ప్రతి మంగళవారం హైదరాబాద్​ రిఫరల్స్, బిజినెస్​మీటింగ్స్​ను నిర్వహిస్తుంది. తెలుగు చాప్టర్ సభ్యులు తమ వ్యాపార వ్యవహారాలు, లావాదేవీల గురించి తెలుగులోనే వివరించవచ్చు. ఈ సమావేశంలో 46 మంది సభ్యులు తమ వ్యాపారాలు, సేవలను పరిచయం చేసుకున్నారు. 80 మంది వ్యాపార రిఫరల్స్​ను మార్చుకున్నారు.