ప్రీమియం లుక్ తో చౌకైన boAt వాచ్.. ధర, ఫీచర్లు ఇవే

ప్రీమియం లుక్ తో చౌకైన boAt వాచ్.. ధర, ఫీచర్లు ఇవే

boAt Ultima Select  కంపెనీ కొత్త స్మార్ట్వాచ్. దీనిని ఇండియాలో లాంచ్ చేశారు. ఈ బడ్జెట్ వాచ్ స్లిమ్మెట్ డిజైన్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ వాచ్ మంచి రిచ్లుక్ ఇచ్చే ఫంక్షనల్ కిరీటం కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్వాచ్ లో కస్టమర్లు 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్ లు, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ వంటి ఫీచర్లను కూడా ఉన్నాయి. 

బోల్ట్ అల్టిమా సెలెక్ట్ ధర రూ. 2,999. కస్టమర్లు దీనిని అమెజాన్, బోట్ కంపెనీ సైట్ నుంచి ఫిబ్రవరి 9 నుంచి కొనుగోలు చేయొచ్చు. బోల్ట్ అల్టిమా సెలెక్ట్ స్మార్ట్ వాచ్ స్టీల్ బ్లాక్ , డీప్ బ్లూ, కూల్ గ్రే, యాక్టివ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయబడింది. కస్టమర్లు సిలికాన్ , మెటల్, మాగ్నెటిక్ పట్టీల ఎంపికలను పొందొచ్చు. 

బోట్ అల్టిమా సెలెక్ట్ స్పెసిఫికేషన్లు 

ఈ స్మార్ట్ వాచ్ లో 2.01 అంగుళాల (40X502పిక్సెల్) ఎప్పుడూ ఆన్ లో ఉండే AMOLED డిస్ ప్లే 1000 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తుంది. ఈ వాచ్ లో బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కూడా ఉంది. క్విక్ డయల్ ప్యాడ్ , దీనిలో 10 కాంటాక్టుల వరకు సేవ్ చేసుకోవచ్చు. 

ఈ స్మార్ట్ వాచ్ లో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్ లు ఉంటాయి. బోట్ కొత్త వాచ్ లో వాయిస్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది దుమ్ము, వాటర్ రెసిస్టెంట్ కోసం IP68 రేట్ చేయబడింది. దీనిలో హెల్త్ కు సంబంధించిన అలెర్ట్ కూడా ఉండి. హార్ట్ బీట్ రేటు, Sp02, నిద్ర, ఒత్తిడి ట్రాకింగ్, రోజువారీ కార్యక్రమాలు, గైడెడ్ బ్రీతింగ్ వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ వాచ్ అందిస్తోంది. 

ఈ స్మార్ట్ వాచ్ లో ఇతర ఫీచర్లు గురించి చెప్పాలంటే.. పేమెంట్ క్యూఆర్, సెడెన్షియల్ అలర్ట్, కెమెరా కంట్రోల్, బిల్ట్ ఇన్ గేమ్స్, మ్యూజిక్ కంట్రోల్, వెదర్, అలారం, క్లాక్, కౌంట్ డౌన్, స్టాప్ వాచ్, డీఎన్ డీ, ఫైండ్ మై ఫోన్ వంటి ఫీచర్లుకూడా ఉన్నాయి. boAt Ultima Select  స్మార్ట్ వాచ్ లో ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 5 రోజుల వరకు వస్తుంది.