లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు : న్యాయమూర్తి ఈసంపల్లి సాయిశివ

లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు : న్యాయమూర్తి ఈసంపల్లి సాయిశివ

బోధన్, వెలుగు: లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దని బోధన్‌‌‌‌‌‌‌‌ అదనపు మొదటి శ్రేణి న్యాయమూర్తి ఈసంపల్లి సాయిశివ సూచించారు. మంగళవారం బోధన్‌‌‌‌‌‌‌‌ పట్టణంలోని ఆచన్‌‌‌‌‌‌‌‌పల్లి ఇందూర్‌‌‌‌‌‌‌‌ హైస్కూల్​లో న్యాయసేవా సమస్త దినోత్సవాన్ని పురస్కరించుకుని, మండల లీగల్ సర్వీస్​కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ విద్యార్థులకు ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. గురువులను గౌరవించాలని సూచించారు. 

ప్రతి విద్యార్థిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని, ఒకరిని మరోకరితో పోల్చకూడదని చెప్పారు.  భిక్షాటన చేసేవారిని మానసిక కేంద్రాల్లో చేర్పించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ పబ్లిక్‌‌‌‌‌‌‌‌ ప్రాసిక్యూటర్స్ జి. శ్యాంరావు, డాక్టర్‌‌‌‌‌‌‌‌ పి.సమ్మయ్య, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ ప్లీడర్ బొగ్గుల రవీం0ద్ర, న్యాయసేవ సంస్థ సభ్యులు సీహెచ్‌‌‌‌‌‌‌‌వీ. హన్మంతరావు, జి. కల్యాణి, ఎ. అజయ్‌‌‌‌‌‌‌‌ కుమార్ తదితరులు పాల్గొన్నారు.