నవీపేట్, వెలుగు: గ్రామాలను అభివృద్ధి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వసలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని ఆర్ ఆర్ గార్డెన్ లో ఇటీవల గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్లను ఆయన సన్మానించారు. గ్రామాల్లోని ప్రధాన సమస్యలపైన సర్పంచ్ లు దృష్టి పెట్టాలని, అందర్నీ కలుపుకొని పోవాలని అప్పుడే ప్రజల్లో మంచి పేరు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, పేదలకోసం ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, ఉచిత కరెంట్ , వంటి పథకలు అమలు చేస్తున్నారని చెప్పారు.
ఎడపల్లి : గ్రామాల సమగ్రాభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని, ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ గ్రామాలలో మంచి పేరు సంపాదించాలని బోధన్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఎడపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్లను, ఉపసర్పంచులను ఆయన సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ గ్రామంలో ప్రస్తుతం అనేక సమస్యలు ఉన్నాయని ఆ సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. గ్రామాలలో రాజకీయ విబేధాలు చూపకుండా, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఆయన అన్నారు. అభివృద్ధి పనుల కు సంబంధించి, తాను ప్రతీ గ్రామానికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఆయన అన్నారు. సర్పంచ్ ఎన్నికలలో పార్టీ బలపరిచిన అభ్యర్ధులకు మద్దతు ఇవ్వడం లో జరిగిన పొరపాట్లను సరిదిద్ది, పార్టీలో ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా సర్దుకు పోవాలని ఆయన సూచించారు.
