బోధన్, వెలుగు : బోధన్ పట్టణంలోని ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న అంబేద్కర్ కాలనీకి చెందిన నిరుపేద విద్యార్థి సాయివర్ధన్ మెడికల్ కాలేజీలో సీటు సాధించినందుకు ‘ఐ లవ్ మై విలేజ్’ ఫౌండేషన్ తరఫున వ్యవస్థాపకులు ఏన్నారై పొలాలి నాగేంద్ర, విద్యార్థి ట్యూషన్ ఫీజు, ఇతర అవసరాల కోసం రూ.1,10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ డబ్బులు ఎంఈవో నాగయ్య చేతుల మీదుగా విద్యార్థికి ఇచ్చారు. కార్యక్రమంలో ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ ప్రభావతి, ప్రతినిధి నగేశ్బాబు, ప్రధానోపాధ్యాయుడు బాలచంద్రం, టీచర్ సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
