
- కొనసాగుతున్న గాలింపు చర్యలు
జగిత్యాల రూరల్, వెలుగు: మహారాష్ట్ర లోని నాందేడ్ సమీపంలో వరదల్లో గల్లంతైన జగిత్యాల వాసుల్లో ఇద్దరి డెడ్బాడీలు దొరికాయి. జగిత్యాలలోని టీఆర్ నగర్ కు చెందిన ముగ్గురు మహిళలు సోమవారం నాందేడ్ జిల్లా దెగ్లూరు సమీపంలో వరదల్లో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఘటన అనంతరం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా, మంగళవారం ఇద్దరి మృతదేహాలు దొరికాయి.
ఘటనా స్థలం నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ముక్రమ్ బాద్ సమీపంలో బ్రిడ్జి పక్కన పంట పొలాల్లో కారు దొరికింది. కొంత దూరంలో హసీనా(32), ఆఫ్రిన్(30) మృతదేహాలు లభించాయి. సమీనా ఆచూకీ రాత్రి వరకు లభించలేదు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.