మియాపూర్లో మిస్సైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు

మియాపూర్లో మిస్సైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు

మియాపూర్లో యువకుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది. డిసెంబర్ 14న మియాపూర్ లో అదృశ్యమైన పవన్ కళ్యాణ్ మృతదేహం దీప్తీ నగర్ లో లభ్యమైంది. ఆదివారం మధ్యాహ్నం దీప్తీ నగర్ లోని ధర్మపురి క్షేత్రంలోని చెట్ల పొదల్లో మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా కాలిన శవం లభ్యమయ్యింది. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుని బావ అనుదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. డిసెంబర్  14న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ ఉందని ఇంట్లోంచి వెళ్లిన పవన్ కళ్యాణ్.. రాత్రి అయినా ఇంటికి తిరిగా రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు మియాపూర్ పోలీసులు.