
- సొంత స్పేస్ వెహికల్స్‌లో ఆస్ట్రోనాట్లను పంపాలన్న కల కల్లలు
వచ్చే ఏడాది ప్రారంభంలో అమెరికా రాకెట్లలో అమెరికా గడ్డ నుంచి అమెరికా ఆస్ట్రోనాట్లను ఐఎస్ఎస్కు పంపుతాం. 2011లో స్పేస్ షటిల్‌లు రిటైర్ అయిన తర్వాత చేయబోతున్న మొదటి ప్రయోగం ఇదే’’… ఇదీ నాసా చీఫ్ జిమ్ బ్రైడెన్‌స్టైన్ చెప్పిన మాట. కానీ, ఆ మాట ఇప్పట్లో నెరవేరేలా లేదు. ప్రయోగం మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
స్పేస్ ప్రయోగాల్లో అమెరికా ఎప్పుడూ ముందే ఉంటుంది. ఎన్నెన్నో ప్రయోగాలు చేసింది. చంద్రుడి మీదకు ఏ దేశానికి కాని రీతిలో 12 మందిని పంపింది. ఆకాశంలో ఆస్ట్రోనాట్లు ఉండేందుకు వీలుగా ఇంటినీ కట్టింది. దాన్నే మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) అంటున్నాం. అది చాలా దేశాల ప్రయోగాలకు డాకింగ్ పాయింట్‌గా ఉంటోంది. అమెరికా, రష్యా, జపాన్, చైనా తదితర దేశాల ఆస్ట్రోనాట్లు అందులోనే ఉంటున్నారు. అయితే, అన్ని ప్రయోగాలను విజయవంతంగా చేస్తున్న అమెరికా, స్వయంగా ఐఎస్ఎస్తో డాకింగ్ కాలేకపోతోంది. ఐఎస్ఎస్కు పోవాలన్నా, అక్కడి నుంచి భూమికి రావాలన్నా రష్యా సాయం తీసుకుంటోంది. రష్యా తయారు చేసిన సోయజ్ స్పేస్‌క్రాఫ్ట్.. ఆస్ట్రోనాట్లను తీసుకెళ్తోంది. తీసుకొస్తోంది. అందుకే ఈ విషయంలోనూ ఎవరి మీదా ఆధారపడకుండా ఉండేందుకు స్వయంగా ఓ క్రూ క్యాప్సూల్‌ను తయారు చేసుకోవాలని నాసా నిర్ణయించింది. కానీ, ఆ ఆశలు ఫలించలేదు. బోయింగ్‌తో కలిసి తయారు చేయించిన క్రూ క్యాప్సూల్ ఐఎస్ఎస్తో అటాచ్ కాలేదు. దీంతో ఎప్పటి నుంచో తన కల తీర్చుకోవాలనుకున్న అమెరికా ఆశ ఆవిరైపోయింది.
స్టార్‌లైనర్
బోయింగ్.. ఇప్పుడు ప్రపంచమంతా మార్మోగిపోతున్న పేరు. 737 మ్యాక్స్ విమానాల్లో లోపం కారణంగా ఆ విమానాల తయారీని ప్రస్తుతానికి నిలిపేసింది సంస్థ. దానికీ కారణం లేకపోలేదు. వరుసబెట్టి జరిగిన ప్రమాదాల్లో వందలాది మంది చనిపోయారు. దీంతో కంపెనీపై నలుమూలల నుంచి ఒత్తిడి పెరిగింది. ఉన్న లోపాన్ని కంపెనీ సరిచేయలేకపోయింది. ప్రొడక్షన్ నిలిపేసింది. ఆ కంపెనీకే ఐఎస్ఎస్ దగ్గరకు ఆస్ట్రోనాట్లను చేర్చే ఓ క్రూ క్యాప్సూల్‌ను తయారు చేసే బాధ్యతను అప్పగించింది నాసా. స్పేస్ ఏజెన్సీ ఇచ్చిన కాంట్రాక్ట్‌కు తగ్గట్టు ‘స్టార్‌లైనర్’ అనే క్రూ క్యాప్సూల్‌ను తయారు చేసిచ్చింది బోయింగ్. దాని మీద ఎన్నో టెస్టులు చేసిన తర్వాత శుక్రవారం ఓ డమ్మీని పెట్టి నాసా సైంటిస్టులు ఆ స్టార్‌లైనర్‌ను యునైటెడ్ లాంచ్ అలయన్స్ అట్లాస్ 5 రాకెట్‌కు పెట్టి నింగిలోకి పంపారు.
వచ్చే ఏడాదే రియల్ ప్రయోగం.. ఇప్పుడు ఫెయిల్
స్టార్‌లైనర్ ప్రధాన ఉద్దేశం.. ఆస్ట్రోనాట్లను ఐఎస్ఎస్కు చేర్చడం. దానికి తగ్గట్టు వచ్చే ఏడాదే స్టార్‌లైనర్‌లో ఆస్ట్రోనాట్లను ఐఎస్ఎస్కు పంపాలని నాసా నిర్ణయించింది. అందుకు రీహార్సల్స్‌గా శుక్రవారం ఈ ప్రయోగం చేసింది. ఆస్ట్రోనాట్లకు బదులు ‘రోసీ’ అనే డమ్మీని పెట్టి నింగిలోకి పంపింది. కానీ, వాళ్ల ప్రయోగం అనుకున్నట్టు సాగలేదు. మధ్యలోనే స్టార్‌లైనర్ గతి తప్పింది. ప్రయోగించిన అరగంటకు రాకెట్ నుంచి స్టార్‌లైనర్ వేరుపడింది. కానీ, కొద్దిసేపటికే కక్ష్య దాటి వేరే మార్గంలోకి వెళ్లిపోయింది. ఆ వెంటనే పేలిపోయింది. దానికి కారణం రాంగ్ టైంలో స్టార్‌లైనర్ ఇంజన్లు మండాయని, దాని వల్లే అది కక్ష్య తప్పి వేరే బాటలోకి వెళ్లిపోయిందని నాసా సైంటిస్టులు తేల్చారు. అనుకున్న కక్ష్యలో స్టార్‌లైనర్ పోలేదని వెల్లడించారు. ఫ్లైట్ కంట్రోలర్లు ట్రబుల్షూట్ చేసినా అది దారిలోకి రాలేదని వివరించారు.
స్పేస్ఎక్స్ సక్సెస్
క్రూ క్యాప్సూల్ తయారీ కోసం బోయింగ్‌తో పాటు స్పేస్ఎక్స్తోనూ నాసా ఒప్పందం చేసుకుంది. బోయింగ్ స్టార్‌లైనర్ ఫెయిలైనా నాసా ‘డ్రాగన్’ క్యాప్సూల్ మాత్రం ఇందులో సక్సెస్ అయింది. ఈ ఏడాది మార్చిలో చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఈ రెండు కంపెనీలతో వందల కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం చేసుకుంది నాసా. అయితే, అనుకున్న షెడ్యూల్‌కు రెండు కంపెనీలూ రెండేళ్లు లేట్ అయ్యాయి.