బిగ్ బాస్ సీజన్7 హోస్ట్ కింగ్ నాగార్జున.. కుడి ఎడమైతే?

బిగ్ బాస్ సీజన్7 హోస్ట్ కింగ్ నాగార్జున.. కుడి ఎడమైతే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7(Bogg boss season7)కు సంబందించిన క్రేజీ అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. ఇటీవల విదుదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అనౌన్స్మెంట్ వీడియోకి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సీజన్ హాట్ ను రివీల్ చేస్తూ మరో ప్రోమోను రిలీజ్ చేశారు షో నిర్వాహకులు.

ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కు కూడా కింగ్ నాగార్జున(King Nagarjuna)నే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. తాజాగా వీడియోలో స్టైలీష్ లుక్ లో కనిపించిన నాగ్.. తనదైన హోస్టింగ్ తో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ ప్రోమో లో నాగార్జునా..  బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈసారి చాలా కొత్తగా.. ఇది ఎప్పుడు చెప్పేదేగా.. ఆ.. కుడి ఎడమైతే.. అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ సీజర్ సరికొత్తగా ఉండబోతుందనే హిట్ ఇచ్చారు. ఈ ప్రోమో సీజన్ పై ఆసక్తిని రేపుతోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 త్వరలోనే టెలికాస్ట్ కానుంది. మరి ఈ సీజన్ ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.