బైక్ ను ఢీకొట్టి 2కి.మీ ఈడ్చుకెల్లిన బొలెరో    

బైక్ ను ఢీకొట్టి 2కి.మీ ఈడ్చుకెల్లిన బొలెరో    
  • ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం 

మెదక్ (నర్సాపూర్): ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న బొలెరో బైకును ఢీకొట్టి ఏకంగా 2కిలోమీటర్ల దూరం బైకును ఈడ్చుకెళ్లింది. నర్సాపూర్ మల్లన్న గుడి వెనుక కుమారుడితో కలసి బైకుపై వెళ్తున్న దంపతులను బొలెరో ఢీకొట్టింది. ఊహించనిరీతిలో వేగంగా వచ్చి బొలెరో ఢొకట్టడంతో బైకుపై వెళ్తున్న దంపతులు, వారి కుమారుడు ఎగిరి కిందపడగా.. బొలెరో వాహనం బైకును 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. 
నర్సాపూర్ మండలం  మాడాపూర్ గ్రామానికి చెందిన బండి భాస్కర్,  స్వాతి దంపతులు, వారి కొడుకుతో కలిసి బైక్ మీద  హైదరాబాద్ నుండి   నర్సాపూర్ కు బయలుదేరారు. నర్సాపూర్ మల్లన్న గుడి సమీపంలో వెనకనుండి   బొలెరో వెహికిల్  చాలా స్పీడ్ గా వచ్చి ఢీ కొట్టింది. దీంతో బైక్ మీద ప్రయాణిస్తున్న ముగ్గురు కిందపడి తీవ్రంగా గాయపడగా.. బొలెరో బైక్ ను  దాదాపు రెండు కిలోమీటర్లు ఈడ్చుకెల్లింది. యాక్సిడెంట్స్ విషయం తెలుసుకున్న  పోలీసులు బొలెరో వాహనాన్ని చేజ్ చేసి పట్టుకున్నారు. బొలెరో  నడుపుతున్న  ప్రవీణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.