బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శిగా కరుణాకర్

 బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శిగా కరుణాకర్

సూర్యాపేట, వెలుగు: బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శిగా ఎర్కారం గ్రామానికి చెందిన బోళ్ల కరుణాకర్ ను నియమించినట్లు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్​లోని సంఘం కార్యాలయంలో ఆయనకు నియామక పత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ.. బీసీ సమాజానికి సేవ చేస్తానన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు పోరాడుదామని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రస్థాయి బీసీల ధూంధాం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.