ముంబై: పెండ్లి చేసుకుంటానని నమ్మించి గత పదేండ్లుగా పనిమనిషిపై అత్యాచారం చేసిన బాలీవుడ్ నటుడిని ఇటీవల ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ (41) గతంలో పలువురు యాక్టర్ల వద్ద పనిమనిషి చేసింది. ఈ క్రమంలోనే కొన్నేండ్ల క్రితం ఆమెకు నదీమ్ ఖాన్ పరిచయమయ్యాడు. దీంతో వారు సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు.
పెండ్లి చేసుకుంటానని నమ్మించి నదీమ్ ఖాన్ తనను మోసం చేశాడని ఆరోపించింది. మాల్వానిలోని తన ఇంట్లో, వెర్సోవాలో ఉన్న నదీమ్ నివాసంలోనూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. అయితే, ఇటీవల పెండ్లి కోసం తాను పట్టుబట్టగా నదీమ్ నిరాకరించాడని, దీంతో న్యాయం కోసం తాను పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొంది.
ఈ ఘటన మొదట మాల్వాని పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో వెర్సోవా పోలీసులు దీనిని ‘జీరో ఎఫ్ఐఆర్’గా నమోదు చేసి, అనంతరం మాల్వాని బదిలీ చేశారు. నదీమ్ ఖాన్ తాజాగా ధురంధర్ మూవీలో నటించాడు.
