అలీఖాన్ ఆటోబయోగ్రఫీ

అలీఖాన్ ఆటోబయోగ్రఫీ

కరోనా వల్ల అందరి జీవితాలకి, కెరీర్స్‌‌కి ఒక్కసారిగా బ్రేక్ పడినట్టయ్యింది. ఎవరికీ కలిసిరాని ఈ సంవత్సరంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మాత్రం కొత్త కొత్త అనౌన్స్‌‌మెంట్స్ చేస్తూ హ్యాపీహ్యాపీగా ఉన్నాడు. తన అభిమానుల్నీ సంతోషపెడుతున్నాడు. బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌‌లో ఒకరైన సైఫ్, కరీనాలు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఆల్రెడీ వీరికి తైమూర్ అనే కొడుకు ఉన్నాడు. ఇప్పుడు మరో బిడ్డతమ ఇంటికి రానుందంటూ ఈమధ్యనే అనౌన్స్ చేశారు. అలాగే ఈ యేడు ఆగ‌‌స్ట్ 16న సైఫ్ యాభయ్యవ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఇది తన లైఫ్‌‌లో చాలా ఇంపార్టెంట్ ఇయర్ అంటూ సంతోష పడ్డాడు సైఫ్. ఇప్పుడు ఇంకో విషయాన్నిప్రకటించి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. నటుడిగా, నిర్మాతగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నసైఫ్.. ఇక రచయితగానూ సత్తా చాటాలనుకుంటున్నాడు. తన ఆత్మకథను రాయబోతున్నాడు. తన ఫ్యామిలీ, కెరీర్, సక్సెస్, ఫెయిల్యూర్స్ , ఇన్‌‌స్పిరేషన్స్, కాంట్రవర్శీస్.. అన్నిటి గురించి ఏమాత్రం దాపరికం లేకుండా ఇందులో రాస్తాడట.

ఓ ఫేమస్ పబ్లిషింగ్ కంపెనీ దీన్ని ప్రింట్ చేయనుంది. నెక్ట్స్‌ ఇయర్ అక్టోబర్‌లో సైఫ్ ఆటోబయోగ్రఫీ మార్కెట్‌లోకి వస్తుందట. ‘రోజులు గ‌‌డిచిపోతున్నాయి. వెనక్కి తిరిగి గత జ్ఞాపకాల్లోకి చూసుకునే సమయం దొరకడం లేదు. అందుకే వాట‌‌న్నింటినీ ఆత్మకథగా మలిస్తే ఆనందంగా ఉంటుంది. ఇది చాలా స్వార్థ‌పూరిత ప్రయత్నం అని నాకు తెలుసు. కానీ ఈ పుస్తకం అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను’ అంటున్నాడు సైఫ్. మరోపక్క సినిమాలతోనూ బిజీగానే ఉన్నాడు సైఫ్. బంటీ ఔర్ బబ్లీ, భూత్ పోలీస్ వంటి మూవీస్ చేస్తున్నాడు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తీయనున్న ‘ఆది పురుష్‌’లో విలన్‌‌గా కూడా సైఫ్ పేరు వినిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం