ఆమె నా బ్యాక్ బోన్

ఆమె నా బ్యాక్ బోన్

అతని స్టోరీ సెలక్షన్ ఎంత యునిక్​గా ఉంటుందో, దాని సక్సెస్ రేట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. క్యారెక్టర్ నిడివి ఎంత ఉన్నా సరే అతని యాక్టింగ్​ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉంటుంది. అతను చేసిన క్యారెక్టర్ పేరుతోనే ప్రేక్షకులకు గుర్తుండిపోతాడు.  బ్యాక్​గ్రౌండ్ డాన్సర్​గా మొదలుపెట్టి, టీవీ సీరియల్స్​లో చిన్న చిన్న రోల్స్ చేసి, సీరియల్​లో లీడ్ రోల్ చేసే స్థాయికి ఎదిగాడు. అక్కడితో ఆగిపోకుండా... బిగ్ స్క్రీన్ మీద, వెబ్ సిరీస్​ల్లో చేస్తూ బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మెస్సీ జర్నీ ఇది. 

‘‘రీసెంట్​గా నేను చేసిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఫోరెన్సిక్’ మూవీ జీ5లో విడుదలైంది. మలయాళంలో హిట్ అయిన ‘ఫోరెన్సిక్’ మూవీకి ఇది రీమేక్. ఇందులో నేను చేసిన ఫోరెన్సిక్ ఆఫీసర్ రోల్ చాలా కష్టం. ఎందుకంటే, ఫోరెన్సిక్ ఆఫీసర్స్ ఏం చేస్తారనేది చాలామందికి తెలియదు. ఇన్వెస్టిగేటివ్ ప్రపంచంలో ఇది డిఫరెంట్ బ్రాంచ్! అలాంటి క్యారెక్టర్​ను ఆడియెన్స్​కి అర్థమయ్యేలా, రియాల్టీకి దగ్గరగా చేయాలి. అందుకని డైరెక్టర్ ఫోరెన్సిక్ ఎక్స్ పర్ట్స్​ని సెట్​కి పిలిపించారు. వాళ్ల సలహాలు తీసుకుంటూ, వాళ్ల ముందే చాలా సీన్స్ చేశాం. అందుకే మూవీ రియలిస్టిక్ గా వచ్చింది. ఇందులో రాధికా ఆప్టేతో కలిసి నటించడం వల్ల... ఆమె నుంచి చాలా నేర్చుకున్నా. ఈ ఫిబ్రవరిలో విడుదలైన రొమాంటిక్ థ్రిల్లర్ ‘లవ్ హాస్టల్’ కూడా నాకు మంచి పేరు తెచ్చింది.

నేను కలగన్నదే
నేను ఏదైతే కలగనేవాడినో దాన్నే 2017 తర్వాత నుంచి చూస్తున్నా. ఆ ఏడాది చేసిన ‘డెత్ ఇన్ ది గంజ్ ’ నా కెరీర్​లో టర్నింగ్ పాయింట్. ఆ సినిమా తర్వాత నన్ను ప్రేక్షకులు చూసే కోణం మారింది. దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. వర్సటైల్ క్యారెక్టర్స్ చేయగలనని నమ్మారు. ఆ మోటివేషనే నన్ను ముందుకు నడిపిస్తుంటుంది. కొన్నిసార్లు ఈ గుర్తింపు నన్ను భయపెడుతుంది కూడా! నిజానికి ఇంతకు మించి కోరుకున్నది కూడా ఏమీలేదు.

మా ప్రిన్సిపల్ వల్లే...
మహారాష్ట్రలోని వడోదరాలో ఉన్న నగ్భిద్ అనే చిన్న టౌన్​లో పుట్టా. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న జాలీ, అమ్మ మీనా. నాన్న వైపు వాళ్లు క్రిస్టియానిటీ, అమ్మ వాళ్ల వైపు సిక్కిజం ఫాలో అవుతారు. మా ఊళ్లోనే ఆంథోనీ హైస్కూల్​లో చదువుకున్నా. తర్వాత ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆర్​.డి. నేషనల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్​లో డిగ్రీ చేశా. మా స్కూల్ ప్రిన్సిపల్ నాకు డాన్స్ నేర్పించేవారు. స్కూల్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆయన మోటివేషన్​ ఇవ్వడం వల్ల డాన్స్, స్కిట్స్ చేసేవాడిని. ఆయన ఇచ్చిన ఇన్​స్పిరేషన్ వల్లే ఆర్ట్​ని కెరీర్​గా ఎంచుకున్నా.

డాన్సర్​గా మొదలుపెట్టి...
ఇంటర్ ఫస్ట్ ఇయర్​లో ఉన్నప్పుడే ‘షియామక్ దావర్’ అనే ఆయన డాన్స్​ ట్రూప్​లో చేరా. ఆయనతో కలిసి కొరియోగ్రఫీ చేసేవాడిని. టౌన్స్ తిరుగుతూ పర్ఫార్మెన్స్ చేస్తుండేవాళ్లం. నా పదిహేడేండ్ల వయసులో దీపావళి పండుగ నాడు డిన్నర్​ చేయడం కోసం ఫ్యామిలీ అంతా కలిసి ముంబై పాలీ హిల్​లో ఉన్న ఒక రెస్టారెంట్​కి వెళ్లాం. స్టార్ టీవీలో పనిచేసే ఒకతను నన్ను చూసి ‘చూసేందుకు బాగున్నావ్. టీవీలో యాక్ట్ చేస్తావా?’ అని అడిగాడు. నేను వెంటనే ‘సరే’ అన్నా. ఆయనే ప్రైమ్ టైమ్ టీవీ షోలో ఒక చిన్న రోల్ ఇప్పించాడు. అలా టీవీ ప్రపంచంలో అడుగుపెట్టా.

మొదటి సీరియల్
‘కహా హూ మై’ అనే టీవీ సీరియల్​లో మొదటిసారి నటించే అవకాశం వచ్చింది. అలా 2004లో నా నటనా జీవితం మొదలైంది. ఆ సీరియల్​లో నేను చేసింది చిన్న రోల్. ‘బాలికా వధు’ సీరియల్​లో నటించడంతో నాకు ఊహించని గుర్తింపు వచ్చింది. అందరూ నన్ను గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ‘ధరమ్ వీర్’, ‘బాబా ఈశ్వర్​ డూండో’ , ‘కుబూల్ హై’  వంటి సీరియల్స్ నాకు టీవీలో స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి.

ఫస్ట్ మూవీ ఛాన్స్


పదేండ్లు హిందీ సీరియల్స్ చేశాక, 2013లో ‘లూటెరా’తో నా సినిమా ప్రయాణం మొదలుపెట్టా. ఆ తర్వాత వచ్చిన ‘దిల్ ధడక్​నే దో’, 2017లో ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ మూవీలో సపోర్టింగ్ రోల్స్ చేశా. టీవీలో నేను చేసిన పాత్రలకు తగ్గట్టుగానే సినిమాల్లో కూడా రోల్స్ ఇచ్చారు డైరెక్టర్లు. నిజానికి నాకది బ్లెస్సింగ్​ అనే చెప్పాలి. ఒకవేళ నాకు ఎంచుకునే అవకాశం ఉంటే ఒకే రకమైన క్యారెక్టర్స్​ ఎంచుకునేవాడినేమో! సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చినప్పుడు కథ, క్యారెక్టర్ ఎంచుకునే పొజిషన్​లో నేను లేను. ఫిల్మ్, అడ్వర్టైజ్​మెంట్​ ఏదైనా ఛాన్స్​ వస్తే చాలు ఓకే చెప్పేవాడ్ని. జటాక్ డియో, క్యాడ్బరీ, ఫినోలెక్స్ ఎల్ఈడీ, నెస్కేఫ్, ఖజానా జ్యూవెల్స్, సామ్ సంగ్ గెలాక్సీ, కార్నెట్టో, ఐడియా 4 జీ వంటి బ్రాండ్స్ తాలూకు టీవీ కమర్షియల్స్​లో చేయడం వల్ల ఆర్ట్ పట్ల నా విజన్ పెరిగింది.  నేను దీన్ని చేయగలను అని చూపించడానికే, వచ్చిన ప్రతి ఆఫర్ ఒప్పుకునేవాడిని. 2017 లో నేను లీడ్ రోల్ లో చేసిన ‘ ఏ డెత్ ఇన్ ది గంజ్’ మూవీ వచ్చే  వరకు కూడా నాకంటూ ఒక పేరు రాలేదు. ఆ మూవీ తర్వాత కాన్షియస్​గా నాకు నచ్చిన క్యారెక్టర్స్ మాత్రమే ఎంచుకుంటున్నా. కష్టమైన రోల్సే ఇంట్రెస్టింగ్​గా అనిపిస్తాయి. కొత్త అవకాశాలు రావడానికి అవి సాయపడతాయి.

కోపం వచ్చి...
యాసిడ్ దాడి నుంచి బయటపడిన ఒక యువతి కథ గా వచ్చిన ‘ఛపాక్’  మూవీలో దీపికా పదుకొణె పక్కన నటించా. అప్పుడు.. హీరో మెటీరియల్ కానని, చూడటానికి బాగాలేనని, బైసప్స్ లేవని చాలా నెగెటివ్​ కామెంట్స్​ వచ్చాయి. వాటిని నేను పర్సనల్ గా తీసుకున్నా. దాంతో చాలా కోపం వచ్చింది. వాళ్ల అభిప్రాయం తప్పని నిరూపించాలనే కసి పెరిగింది. యాక్టర్​గా టీవీలో పదేండ్ల అనుభవం ఉన్నా... దాన్ని ఎవరూ పరిగణలోకే తీసుకోలేదు. టీవీ, సినిమా రెండూ వేరు వేరు. అందుకని వాటి ప్రయారిటీస్​ బట్టి మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టా.

అవి బేసిక్​ స్కిల్స్​​
నేను చేసిన వాటిలో స్మాల్​ టౌన్ క్యారెక్టర్స్ ఎక్కువ. కానీ, ప్రతిదీ డిఫరెంట్​గా ఉంటుంది. డాన్స్ ట్రూప్​లో ఉండటం వల్ల, టీనేజ్​లోనే నేను ఎక్కువగా ట్రావెల్ చేశా.  టౌన్స్​లో వారాలు, నెలలు ఉండేవాడ్ని. అప్పుడే టౌన్స్​లో ఉండే వాళ్ల మనస్తత్వాలు అర్థం చేసుకున్నా. చరిత్ర, మనుషులు, వారి మనస్తత్వాలు, జీవితాన్ని అర్థం చేసుకోవడం యాక్టర్​కి ఒక బేసిక్ స్కిల్ అని నమ్ముతా. అవే మనం చేసే క్యారెక్టర్​ని యునిక్​గా చేస్తాయి.

అవుట్ సైడర్​కి కష్టమే
మనం మంచి యాక్టర్ అయితే తప్ప... ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. స్టార్ కిడ్స్​​కి, అన్ని రకాల సమాచారం ఉంటుంది. వాళ్లు ఎండలో తిరగక్కర్లేదు. ఆడిషన్స్ ఇవ్వక్కర్లేదు. నాలాంటి అవుట్​సైడర్స్​​​కి అలాంటి అవకాశం ఉండదు. ఆడిషన్​కి ​వెళ్లినప్పుడు, మన రోల్ నిడివి బట్టి, వాళ్లు మనల్ని చూసే తీరు మారుతుంటుంది. ఇలాంటప్పుడు, మనకు అదృష్టం లేదని బాధపడకూడదు. ప్రతి ఛాలెంజ్​ని ఒక అవకాశంగా మార్చుకోవాలి. టాలెంట్ మాత్రమే అవకాశాల్ని సక్సెస్ గా మారుస్తుంది. 

పెద్ద తేడా ఉండదు
సినిమాలు, వెబ్ సిరీస్​లు రెంటికీ పెద్ద తేడా ఉండదు. వాటికి కేటాయించే టైం విషయంలోనే తేడా ఉంటుంది. నేను మామూలుగా మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తా. వాటి షూటింగ్ 40 నుంచి 45 రోజుల్లో పూర్తవుతుంది. ఒక వెబ్ సిరీస్ చేస్తే, కనీసం మూడు, నాలుగు సినిమాలు చేసినట్టే. యాక్టర్స్​కే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటీటీ ఎన్నో అవకాశాలు ఇస్తోంది.’’

ఆమె నా బ్యాక్ బోన్


షీతల్, నేను కలిసి ‘బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్’లో యాక్ట్ చేయకముందే ఒకరికొకరం తెలుసు. ఆరేండ్ల నుంచి కలిసి జర్నీ చేశాం. ప్రేమించుకున్నాం. ఆమె నా బ్యాక్ బోన్. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాం. ఎలాంటి ఛాలెంజ్ ఎదురైనా సరే, ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసేది తనే.

గుర్తుండిపోయే క్యారెక్టర్స్
‘లిప్​స్టిక్​ అండర్ మై బుర్ఖా’లో అర్షద్, ‘ఛపాక్’లో అమోల్, ‘కార్గో’లో ప్రశాంత, ‘రామ్​ప్రసాద్ కి తేవ్రీ’లో రాహుల్, ‘మిర్జాపూర్ ’లో బబ్లూ పండిత్, ‘బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్’ లో వీర్... ఇలా ప్రతీది గుర్తుండిపోయే పాత్రలు చేశా. ‘జిన్నీ వెడ్స్ సన్నీ’ ‘క్రిమినల్ జస్టిస్​’, ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సిరీస్ లు నాకు మంచి పేరు తీసుకొచ్చాయి.