OG Glimpse: OG గ్లింప్స్ వచ్చేస్తోంది.. సాలిడ్ అప్డేట్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్

OG Glimpse: OG గ్లింప్స్ వచ్చేస్తోంది.. సాలిడ్ అప్డేట్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ(OG). సాహూ మూవీ ఫేమ్ సుజీత్(Sujeeth) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కారణం.. పవన్ తన కెరీర్ లో ఫస్ట్  టైం గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాకు మునుపెన్నడూ లేని హైప్ క్రియేట్ అవుతోంది. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ టీజర్ తరువాత సినిమాపై హైప్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. 

ఇప్పటికే సగం వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఆగిపోయింది. కారణం పవన్ కళ్యాణ్ ప్రస్తతం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. అవి కంప్లీట్ అయిన వెంటనే ఓజీ సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మి. ఆయన ఓజీ సినిమాలో విలన్ రోల్ లో కనిపించనున్నాడు. తాజాగా ఆయనకు ఒక నెటిజన్ ఓజీ అప్డేట్ గురించి అడిగాడు. మిమ్మల్ని ఓజీ సినిమాలో చూసేందుకు వెయిట్ చేస్తున్నాము. సినిమాలో మీ రోల్ గురించి కొంచం చెప్పండి అంటూ అడిగాడు. దానికి సమాధానంగా ఇమ్రాన్ హస్మి.. ఇప్పుడు నా పాత్ర గురించి చెప్పలేను కానీ, త్వరలో గ్లింప్స్ విడుదల అవుతోంది అంటూ చెప్పుకొచ్చాడు. 

దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్  మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఓజీ సినిమాలో ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా  ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.