
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తెలుగులో నటిస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న ఈ సినిమాలో సంజయ్ పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్న మేకర్స్.. ప్రస్తుతం డబ్బింగ్ పనులను కంప్లీట్ చేస్తున్నారు. తాజాగా సంజయ్ దత్ తన పాత్రకు సంబంధించి హిందీ డబ్బింగ్‌ను చెప్పినట్టు బుధవారం అప్‌డేట్ ఇచ్చారు.
ఆయన పాత్రతో పాటు సంజయ్ వాయిస్ సినిమాకు పవర్ ఇచ్చేలా ఉంటుందని తెలియజేశారు. అలాగే ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అలీ, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.