లక్నో: దేశంలో విమానాలకు వరుస బాంబు బెదిరింపుల కాల్స్ తీవ్ర కలలకం రేపుతున్నాయి. ఇదిలా ఉండగానే.. ఇవాళ (అక్టోబర్ 15) మరో విమానానికి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. రాజస్థాన్ రాజధాని జైపూర్ నుండి బయలుదేరిన విమానంలో బాంబ్ పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ ద్వారా అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ లతో విమానంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. బాంబ్, ఇతర పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాంబ్ థ్రెట్ కాల్ చేసిన దుండగుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ | అమెరికా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం కెనడాకు దారి మళ్లింపు