
2018లో ఆత్మహత్యకు పాల్పడిన కేసులో రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి హస్తం ఉందంటూ అతనికి అత్యవసర బెయిల్ ఇచ్చేందుకు బొంబాయి హైకోర్ట్ నిరాకరించింది. 2018లో ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ మరియు అతని తల్లి కుముద్ నాయక్ అలీబాగ్ వద్ద ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశారు. ఆ సూసైడ్ నోటులో తాము కాంకోర్డ్ డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వివరించారు. రిపబ్లిక్ టీవీ అధినేత ఆర్నాబ్ గోస్వామితో పాటు ఆయన స్నేహితులు కాంకోర్డ్ డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేతలు తమకు 5కోట్లు బాకీ పడ్డారని, వాటిని తిరిగి చెల్లించడం లేదు కాబట్టే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాధితులు లేఖలో పేర్కొన్నారు. ఈ కేసు విషయంపై ఆర్నాబ్ బొంబాయి హైకోర్ట్ లో ముందస్తు బెయిల్ కోసం అప్లయ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్ఎస్ షిండే మరియు ఎంఎస్ కార్నిక్ డివిజన్ బెంచ్ అర్నాబ్ గోస్వామకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి. బెయిల్ మంజూరు చేస్తే కేసు నిర్విర్యం అయ్యే అవకాశం ఉందంటూ చీఫ్ జస్టిస్ లు బొంబాయి హైకోర్ట్ కు తెలిపారు. దీంతో ఇరు పక్షవాదనలు విన్న కోర్ట్ ఆర్నాబ్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.