కేరళ, కాశ్మీర్​కు లంక బాంబర్లు

కేరళ, కాశ్మీర్​కు లంక బాంబర్లు
  • ట్రైనింగ్ తీసుకున్నారన్న శ్రీలంక ఆర్మీ చీఫ్
  • కొట్టి పారేసిన ఇండియా భద్రతాధికారి

కొలంబో: శ్రీలంకలో ఆత్మాహుతి దాడులకు పాల్పడిన బాంబర్లు ఇండియాకు వచ్చారా? ఇక్కడే శిక్షణ తీసుకుని పేలుళ్లకు తెగబడ్డారా? అంటే అవుననే అంటున్నారు శ్రీలంక ఆర్మీ చీఫ్ లెఫ్టినెం ట్ జనరల్​ మహేశ్ సేననాయకే. ఏప్రిల్​ 21న ఈస్టర్​ పండుగ సందర్భంగా చర్చిలు, లగ్జరీ హోటళ్లే టార్గెట్ గా మహిళ సహా 9 మంది ఆత్మాహుతి దాడులకు తెగబడి 253 మందిని బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లోనే తొలిసారిగా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఈ సంచలనవ్యాఖ్యలు చేశారు.

‘సూసైడ్ బాంబర్లు ఇండియా వెళ్లారు . కాశ్మీర్​, బెంగళూరుల్లో తిరిగారు. అక్కడి నుంచి కేరళకు వెళ్లారు . అంత వరకే తెలిసింది’ అని బీబీసీకి ఇచ్చి న ఇంటర్వ్యూలో సేననాయకే అన్నారు. అక్కడ పేలుళ్లకు సంబంధించి శిక్షణ తీసుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు . అయితే, ఆ వార్తలను ఇండియా కొట్టి పారేసిం ది. శ్రీలంక చెబుతున్నమాటలకు సరైన ఆధారాలేవీ లేవని ఓ భద్రతాధికారి వెల్లడించారు. శ్రీలంక టెర్రరిస్టు అటాక్​ తర్వాత కాశ్మీర్​కు వచ్చిన శ్రీలంక ప్రజల వివరాలను ఇమిగ్రేషన్​ రికార్డుల్లో పరిశీలిం చామని, శ్రీలంక పేలుళ్లకు పాల్పడిన ఆత్మాహుతి దాడి సభ్యుల్లో ఏ ఒక్కరూ ఇండియాకు రాలేదని చెప్పారు.