ఇయ్యాల, రేపు ఢిల్లీలో బోనాల పండుగ

ఇయ్యాల, రేపు ఢిల్లీలో బోనాల పండుగ

న్యూఢిల్లీ, వెలుగు: పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో బోనాల ఉత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఇండియా గేట్ నుంచి ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వ‌ర‌కు అమ్మవారి ఘ‌ట‌ ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఢిల్లీలో అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తామని అప్పట్లో మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నామని, రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏటా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్​ నుంచి ఆదివారమే పోతరాజులు, కళాకారులు ఢిల్లీకి చేరుకున్నారు.