
వేములవాడ, వెలుగు: శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం బద్దిపోచమ్మకు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ముందుగా ఉద్యోగులు ఆలయంలో కోడె మొక్కులు చెల్లించి, స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఉప్పు గడ్డ వీధిలోని యూనియన్ ఆఫీస్‌లో బోనం, పుణ్యాఃవచనము, అర్చకులచే గ్రామ దేవత, శీతల దేవత పూజ చేసి ఊరేగింపుగా వెళ్లి బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు.
కార్యక్రమంలో రాష్ట్ర టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ఉమ్మడి జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు దారం శ్రీనివాస్, ఎల్సాని ప్రవీణ్ కుమార్, నాగేందర్, రాజన్న ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి వంశీ, బీజేపీ లీడర్ప్రతాప రామకృష్ణ, బీఆర్ఎస్ నేతలు చల్మెడ లక్ష్మీనరసింహ రావు , ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.