దళిత ఎంపీని అవమానించిన అధికారులపై అట్రాసిటీ కేసు పెట్టాలి : బొంకూరి మధు

దళిత ఎంపీని అవమానించిన అధికారులపై  అట్రాసిటీ కేసు పెట్టాలి : బొంకూరి మధు

గోదావరిఖని, వెలుగు: సరస్వతి పుష్కరాల్లో భాగంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటోను ఫ్లెక్సీపై  పెట్టకుండా అవమానించిన దేవాదాయ శాఖ ఆఫీసర్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు డిమాండ్​ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో కాకా వెంకటస్వామి కీలకంగా పనిచేశారని, ఆయన కొడుకులు మనవడు వంశీ కృష్ణ ఎంపీగా ఉన్నారని, అలాంటి కుటుంబంపై కొందరు రాజకీయంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. 

ప్రజలు ఎన్నుకున్న ఎంపీపైనే వివక్ష చూపిస్తుండగా ఇక సాధారణ దళిత ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎంపీ వంశీకృష్ణకు మద్దతుగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఉంటుందని, దళిత సంఘాలను కలుపుకొని సీఎం క్యాంప్ ఆఫీస్​ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో తక్షణమే సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి జోక్యం చేసుకోవాలని కోరారు.