మోడీ పుస్తకాలకు మస్తు క్రేజ్‌‌

మోడీ పుస్తకాలకు మస్తు క్రేజ్‌‌

వారణాసిలో హాట్‌‌కేకుల్లా సేల్స్‌‌

వారణాసి: టెంపుల్‌‌ సిటీ వారణాసి.. పరిచయం అక్కర్లేని పేరు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి పోటీ చేస్తున్న లోక్‌‌సభ స్థానం. వారణాసిలో మోడీకి పాపులారిటీ ఉన్నట్లుగానే ఆయన పేరుతో రాసిన పుస్తకాలకు కూడా అంతే డిమాండ్‌‌ ఉంది. మోడీ పేరుతో ఏ పుస్తకం వచ్చినా హాట్‌‌కేకులా అమ్ముడు పోతుందని బుక్‌‌షాప్స్‌‌ ఓనర్లు చెప్తున్నారు. “ ది రియల్‌‌ మోడీ’’, “ నరేంద్ర మోడీ: ఏక్‌‌ సకారాత్మక్‌‌ సోచ్‌‌” పేరుతో ఉన్న పుస్తకాలను బాగా కొంటున్నారని అన్నారు. “ అపూర్వ షా రాసిన “ నరేంద్ర మోడీ: ఏక్‌‌ సకారాత్మక్‌‌ సోచ్‌‌” పుస్తకాన్ని చక్కగా డిజైన్‌‌ చేశారు. ఖాదీ కుర్తా వేసుకుని ఉన్న మోడీ కటౌట్‌‌లాగా దాన్ని తయారు చేశారు. ఒకవైపు ఇంగ్లీష్‌‌, మరోవైపు హిందీలో ఉంటుంది. డిఫరెంట్‌‌గా ఉన్న ఈ పుస్తకాన్ని అందరూ బాగా కొంటున్నారు. “ ది రియల్‌‌ మోడీ’’  పుస్తకాలు హాట్‌‌ చాయ్‌‌లా అమ్ముడుపోతున్నాయి” అని 50 ఏళ్ల నుంచి యూనివర్సల్‌‌ బుక్‌‌స్టోర్‌‌‌‌ నడుపుతున్న అమిత్‌‌ సింగ్‌‌ చెప్పారు.

నామినేషన్‌‌ వేసే ముందు పాల్గొన్న ప్రచార సభలో ఈ పుస్తకం లైఫ్‌‌సైజ్‌‌వర్షన్‌‌ అందరినీ బాగా ఆకట్టుకుంది. “గతంలో “ ఏ పిలిగ్రిమేజ్‌‌ టు కాశీ’’ లాంటి నావెల్స్‌‌ బాగా అడిగేవారు. ఇప్పుడు మోడీ పుస్తకాలను అడుగుతున్నారు. ఆ పుస్తకాల స్టాక్‌‌ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు” అని బుక్‌‌ షాప్‌‌లో పనిచేసే వర్కర్‌‌‌‌ ఒకరు చెప్పారు. 11 అంగుళాల పొడవు ఉన్న “నరేంద్ర మోడీ: ఏక్‌‌ సకారాత్మక్‌‌ సోచ్‌‌” పుస్తకం మూడో ఎడిషన్‌‌ను మార్చిలో రిలీజ్‌‌ అయింది. దీంట్లో మోడీ జీవితం, సర్జికల్‌‌ స్ట్రైక్స్‌‌, ఎయిర్‌‌‌‌స్ట్రైక్స్‌‌ తదితర అంశాలను రాశారు. ‘రియల్‌‌ మోడీ’ పుస్తకం ఈ ఏడాది బాగా అమ్ముడుపోయిందని, ఎన్నికలు కావటంతో ఇది హాట్‌‌ కేకులా సేల్‌‌ అవుతోంది.