అనాథాశ్రమంలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ : డిప్యూటీ జనరల్ మేనేజర్ సీఎల్ గిరిధర్

అనాథాశ్రమంలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ : డిప్యూటీ జనరల్ మేనేజర్ సీఎల్ గిరిధర్
  •  ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ ఔట్ రీచ్

సూర్యాపేట, వెలుగు: కమ్యూనిటీ ఔట్ రీచ్ కింద ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ  సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ సీఎల్ గిరిధర్, రీజినల్ మేనేజర్ ఎం.విష్ణు వర్ధన్ తెలిపారు. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047లో భాగంగా ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో సూర్యాపేట సమీపంలోని చార్లెస్ అనాథశ్రమంలోని విద్యార్థులకు స్టడీ చైర్స్, బుక్స్, స్టేషనరీ పంపిణీ చేశారు.. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓరియంటల్  ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో భవిష్యత్ లో మరిన్ని గ్రామాల్లో సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పి.రమేశ్, ఎం. వినయ్ సాగర్, ఎస్. సాయిచౌహన్, ఎం.వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.