Bootcut Balaraju OTT: సోహైల్ ఏడ్చింది ఈ సినిమా కోసమే.. OTT వచ్చేస్తోంది ఇప్పుడైనా చేస్తారా!

Bootcut Balaraju OTT: సోహైల్ ఏడ్చింది ఈ సినిమా కోసమే.. OTT వచ్చేస్తోంది ఇప్పుడైనా చేస్తారా!

బిగ్ బాస్ ఫేమ్ సోహైల్(Sohail) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ బూట్‌ కట్‌ బాలరాజు(Bootcut Balaraju). దర్శకుడు శ్రీ కోనేటి తెరెకెక్కించిన ఈ సినిమాలో మేఘ లేఖ హీరోయిన్ గా నటించారు. విలేజ్ బ్యాక్డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

అయితే ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మినిమమ్ రెస్పాన్స్ కూడా రాలేదు. రిలీజ్ రోజు థియేటర్స్ లో ఆడియన్స్ లేకపోవడంతో చాలా చోట్ల షోస్ క్యాన్సిల్ అయ్యాయి. దీంతో మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన సినిమాను చూడాలంటూ కెమెరాల ముందు బోరున ఏడ్చాడు. అయినప్పటికీ ఆడియన్స్ ఈ సినిమాను చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

బూట్‌ కట్‌ బాలరాజు ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఇక సినిమా విడుదలైన సరిగ్గా నెల రోజులకి అంటే మార్చ్ 1న బూట్‌ కట్‌ బాలరాజు సినిమాను స్ట్రీమింగ్ చేయాలని చూస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి థియేటర్స్ లో పట్టించుకోని ఈ సినిమాను ఓటీటీలో ఏమేరకు ఆదరిస్తారో చూడాలి.

Also Read : రక్తం అమ్ముకొని బ్రతికాను.. కన్నీళ్లు పెట్టుకున్న సీరియల్ నటి నైనీషా