దుబాయ్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ ఫ్రీ టెన్నిస్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో బోపన్న జోడీ

దుబాయ్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ ఫ్రీ టెన్నిస్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో బోపన్న జోడీ

దుబాయ్‌‌‌‌‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ రోహన్‌‌‌‌‌‌‌‌ బోపన్న–మాథ్యూ ఎబ్డెన్‌‌‌‌‌‌‌‌ (ఆస్ట్రేలియా) జోడీ.. దుబాయ్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ ఫ్రీ టెన్నిస్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో బోపన్న–ఎబ్డెన్‌‌‌‌‌‌‌‌ 7–6 (4), 7–6 (5)తో స్కాందర్‌‌‌‌‌‌‌‌ మన్సూరి (ట్యూనీషియా)–ఐజమ్‌‌‌‌‌‌‌‌ ఉల్‌‌‌‌‌‌‌‌ హక్‌‌‌‌‌‌‌‌ ఖురేషి (పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌)పై గెలిచారు. గంటా 41 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండో–ఆసీస్‌‌‌‌‌‌‌‌ ద్వయం బలమైన సర్వీస్‌‌‌‌‌‌‌‌లతో ఆకట్టుకుంది. 

మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో యూకీ భాంబ్రీ–రాబిన్‌‌‌‌‌‌‌‌ హాస్‌‌‌‌‌‌‌‌ (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌) 6–7 (6), 6–3, 10–8తో అలెగ్జాండర్‌‌‌‌‌‌‌‌ బుబ్లిక్‌‌‌‌‌‌‌‌ (కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌)–అడ్రియన్‌‌‌‌‌‌‌‌ మనారినో (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌)పై నెగ్గి ముందంజ వేశారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో సుమిత్‌‌‌‌‌‌‌‌ నగాల్‌‌‌‌‌‌‌‌ 4–6, 7–5, 1–6తో లోరెంజో సోనెగో (ఇటలీ) చేతిలో ఓడాడు.