
Borana Weaves IPO: అనేక వారాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం తిరిగి స్టార్ట్ అవుతోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లు ఒడిదొడులతో భారీ నష్టాలను నమోదు చేసినప్పటికీ ఐపీవోలు మాత్రం పెట్టుబడిదారులకు మంచి లిస్టింగ్ గెయిన్స్ అందిస్తూ సంతోషం నింపుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో జాబితా అయిన బొరానా వీన్స్ కంపెనీ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు నేడు బీఎస్ఈలో ఒక్కోటి 12.5 శాతం ప్రీమియం ధర రూ.243 వద్ద అరంగేట్రం చేశాయి. దీని తర్వాత ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల కోలాహలంతో స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ.255.10 రేటు వద్ద కొనసాగుతోంది.
వాస్తవానికి ఐపీవో ఇష్యూ సమయంలో కంపెనీ ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.216గా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. లాట్ పరిమాణాన్ని 69 షేర్లుగా నిర్ణయించటంతో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.14వేల 145 ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. వాస్తవానికి ఐపీవో మే 20 నుంచి 22 వరకు రిటైల్ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంచబడింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.144.89 కోట్లను సమీకరించింది. ఇందుకోసం 67 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేసింది.
కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.65.20 కోట్లను సమీకరించింది. ఇన్వెస్టర్ల నుంచి మంచి డిమాండ్ చూసిన ఐపీవో రిటైల్ విభాగంలో 200.50 సార్లు, QIB విభాగంలో 85.53 సార్లు, NII విభాగంలో 237.41 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. బ్లాక్ బస్టర్ లిస్టింగ్ తర్వాత కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో కంపెనీ షేర్లకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది.
కంపెనీ వ్యాపారం..
అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బోరానా వీవ్స్ బ్లీచ్ చేయని సింథటిక్ గ్రే ఫాబ్రిక్‌ను తయారు చేసి మార్కెట్ చేస్తుంది. ప్రధానంగా B2B విభాగంలో సేవలను అందిస్తుంది. మెరుగైన కస్టమర్ సర్వీస్, సకాలంలో డెలివరీల కోసం కంపెనీ తన ప్రాంతీయ ఉనికిని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.