బోర్నిల్‌‌‌‌కు ‘ఆసియా’ గోల్డ్‌‌‌‌

బోర్నిల్‌‌‌‌కు ‘ఆసియా’ గోల్డ్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా యంగ్‌‌‌‌ షట్లర్‌‌‌‌ బోర్నిల్‌‌‌‌ ఆకాశ్‌‌‌‌ చాంగ్‌‌‌‌మయ్‌‌‌‌.. ఆసియా జూనియర్‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌ టోర్నీలో చరిత్ర సృష్టించాడు. అండర్‌‌‌‌–15 కేటగిరీలో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ నెగ్గిన రెండో ప్లేయర్‌‌‌‌గా రికార్డులకెక్కాడు. ఆదివారం జరిగిన బాయ్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ఫైనల్లో బోర్నిల్‌‌‌‌ 21–19, 21–13తో ఫాన్‌‌‌‌ హంగ్‌‌‌‌ జుయాన్‌‌‌‌ను చిత్తు చేశాడు. దీంతో సిరిల్‌‌‌‌ వర్మ (2013) తర్వాత జూనియర్‌‌‌‌ టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్‌‌‌‌గా నిలిచాడు. 34 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో బోర్నిల్‌‌‌‌కు తొలి గేమ్‌‌‌‌లో గట్టి పోటీ ఎదురైంది. అయినా సుదీర్ఘమైన ర్యాలీలు ఆడుతూ, క్రాస్‌‌‌‌ కోర్టు విన్నర్లతో గేమ్‌‌‌‌ నెగ్గాడు. ఇక రెండో గేమ్‌‌‌‌లో ఇండియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ ఆధిపత్యమే నడిచింది. బాలికల అండర్‌‌‌‌–17 ఫైనల్లో తన్వీ శర్మ 17–21, 21–11, 19–21తో యటవీమిన్ కెట్‌‌‌‌క్లింగ్‌‌‌‌ (థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌) చేతిలో ఓడి రన్నరప్‌‌‌‌తో సరిపెట్టుకుంది. అయితే ఉన్నతి హుడా తర్వాత ఈ కేటగిరీలో ఫైనల్‌‌‌‌ చేరిన రెండో ఇండియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా తన్వి ఘనత సాధించింది.