
హైదరాబాద్, వెలుగు: హోమ్ అప్లయెన్సెస్ బ్రాండ్ బాష్ క్రిస్ప్మాక్స్ ఎయిర్ ఫ్రయర్స్‌ను విడుదల చేసింది. సెరీ 2 (4 లీటర్లు), సెరీ 6 (7.2 లీటర్లు) వేరియంట్లలో ఈ క్రిస్ప్మాక్స్ రేంజ్ అందుబాటులో ఉంది. చిన్న కిచెన్లు, కొత్తగా కొనేవారికి సెరీ 2 సరిపోతుందని, 7.2 లీటర్ల వెర్షన్ పెద్ద కుటుంబాలకు అనువుగా ఉంటుందని బాష్ తెలిపింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చామని పేర్కొంది.
తక్కువ నూనెతో, ఆరోగ్యకరమైన పద్ధతిలో కరకరలాడే ఆహారాన్ని వండుకోవాలనుకునే కస్టమర్లను ఇది లక్ష్యంగా చేసుకుంది. సంప్రదాయ డీప్ ఫ్రై పద్ధతితో పోలిస్తే క్రిస్ప్మ్యాక్స్రేంజ్ఎయిర్ఫ్రయర్లు 95 శాతం వరకు తక్కువ నూనెను ఉపయోగించుకుంటాయని బాష్ పేర్కొంది. వీటిలో ప్రీహీట్, కుక్, కీప్ వార్మ్ వంటి మూడు ప్రధాన ఫంక్షన్లు ఉంటాయి