భవిష్యత్ కు పునాదులు గవర్నమెంట్ స్కూళ్లు : అనిల్ జాదవ్

భవిష్యత్ కు పునాదులు గవర్నమెంట్ స్కూళ్లు : అనిల్ జాదవ్

నేరడిగొండ, వెలుగు: స్టూడెంట్ల ఉజ్వల భవిష్యత్​కు గవర్నమెంట్ స్కూళ్లు పునాదులని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని రాజురా గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్​గా హాజరై స్టూడెంట్లకు యూనిఫామ్​లు అందజేసి చాక్లెట్లు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లలో చేర్పించి, వారి విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు కృషి చేయాలని సూచించారు.

తాను కూడా ఇదే రాజూరా గవర్నమెంట్ స్కూల్​లో చదివి ఎమ్మెల్యేగా ఎదిగానని గుర్తుచేశారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న స్కూల్ బిల్డింగ్, లో లెవల్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఎంపీపీ రాథోడ్ సజన్, నేరడిగొండ వీడీసీ చైర్మన్ రవీందర్ రెడ్డి, గులాబ్ సింగ్, టీచర్లు, మండల నాయకులు పాల్గొన్నారు . 

పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని కుప్టిలో ఆయన మొక్కలు నాటారు. పచ్చదనం, పర్యావరణం సకల జీవకోటి మనుగడకు ఎంతో ఉపయోగకరమన్నారు. మొక్కలు నాటి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం గ్రామంలోని బీడీ కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎంపీపీ రాథోడ్ సజన్, మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, మందుల రమేశ్, రవీందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.