
బోథ్, వెలుగు: బోథ్నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్చేయాలని డిమాండ్‌చేస్తూ 45 రోజులుగా రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు, రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం వారికి మద్దతుగా రైతులు బోథ్‌లో ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఎడ్ల బండ్లతో బస్టాండ్‌లో మానవహారం నిర్వహించారు. తర్వాత రిలే దీక్షల్లో కూర్చొని నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. ఆయా గ్రామాల ప్రజలు, రైతులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.