
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ బాక్సర్లు వికాస్ క్రిషన్, నీరజ్ గోయల్, సతీశ్ కుమార్ వివాదంలో ఇరుక్కున్నారు. పటియాలలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో ఈ ముగ్గురు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఐసోలేషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించకుండా రూల్స్‌ను బ్రేక్ చేశారని ఆరోపణలు వచ్చాయి. కరోనా టైమ్‌లో వేరే బాక్సర్లతో కలిసి తిరిగారని సాయ్‌కు సమాచారం అందడంతో వీళ్లపై విచారణకు ఆదేశించింది. ఇందుకు నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. సాయ్ సెక్రటరీ రోహిత్ భరద్వాజ్ ఈ కమిటీకి నాయకత్వం వహించనున్నారు. కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం బాక్సర్లపై చర్యలు తీసుకోనున్నారు. కామన్వెల్త్, ఏషియన్గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ వికాస్ క్రిషన్(69 కేజీలు)తోపాటు సతీశ్(91 ప్లస్ కేజీలు) ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించారు.